Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్లో హైదరాబాద్ బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి ఆధ్వర్యంలో పేదలకు సేవలందిస్తున్న ప్రముఖులకు ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ చైర్మెన్ డాక్టర్ ఏరోళ్ల శ్రీనివాస్‌ను సన్మానించి ఉత్తమ సేవా అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ నాయకులు డాక్టర్ బరిగెల రమేష్, డాక్టర్ ఘంటా చక్రపాణి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, బందు సొసైటీ అధ్యక్షులు వీరస్వామి, సురేందర్ రెడ్డి, డాక్టర్ కె.రమేష్, రాజయ్య, శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.