Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్లో గల హైదర్ బస్తీలో నిర్వహించిన గ్యార్మీ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం మీరు ఉంటున్న క్వార్టర్స్ స్థలాలు త్వరలోనే ఇక మీవే కానున్నాయని చెప్పారు. నగరంలోని 9 ప్రాంతాల్లో 485 క్వార్టర్స్‌ను నిర్మించామనీ, అందులో హైదర్ బస్తీ ఒకటి అని చెప్పారు. ఏండ్లుగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారనీ, పేదలు సంతో షంగా ఉండాలని కోరుకునే సీఎం ఈ సమస్య పరిష్కా రానికి చొరవ చూపారని చెప్పారు. ఇందుకోసం మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో బస్తీకి చెందిన రజాక్, మౌలా బేగ్, బాలు, మాజీ కార్పొరేటర్ కిరణ్మయి, నాయకులు గౌస్, ఆజామ్, దస్తగిరి, జనార్దన్, రాజు, కళావతి, పద్మ, చంద్రకళ, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి..
ఓల్డ్ గ్యాస్ మండీలోని ఉప్పలమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీ వాసులకు హామీనిచ్చారు. ఆలయంలో ఇటీవల చోరీ జరిగిన విషయం తెలుసుకున్న మంత్రి ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విస్తరించి నిర్మించాలని స్థానిక మహిళలు మంత్రిని కోరగా, భక్తులకు సౌకర్య వంతంగా ఉండే విధంగా త్వరలోనే తన వ్యక్తిగత నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ముందుగా బస్తీవాసులు సమావేశమై ఆలయ అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏడాదీ బోనాల నిర్వహణ కోసం ఉప్పలమ్మ ఆలయానికి ప్రభుత్వం రూ.30 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, బస్తీకి చెందిన మనోజ్, అభిషేక్, దుర్గేష్, శ్రీను, శశి పాల్గొన్నారు.