Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
రైతు కండ్లల్లో ఆనందం కోసమే రైతుబంధు పెట్టుబడి సాయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్, శామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి, మురహరిపల్లి గ్రామాలు, మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, కొల్తూరు, ఆనంతారం, నారాయణ పూర్ గ్రామాల్లో ఆదివారం టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బంధు రూ.50 వేల కోట్లకు చేరటంతో రైతు బంధు విజయోత్సవ సంబురాలు, సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంఆ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అథితులు మాట్లాడుతూ కేసీఆర్ రైతు బాంధవుడు అనీ, రైతు పక్ష పాతిగా ఉంటూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని రైతన్నలో సంతోషం వెల్లివిరిస్తుందనీ, కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉందనీ, అందుకు నిదర్శనమే నేడు రైతులు జరుపుకున్న సంబురం అన్నారు. ప్రపంచం, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్న ఏకైన ప్రభుత్వం టీఆర్ఎస్ లన్నారు. గతంలో కరెంట్ రాక, పంటలు ఎండి రైతులకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటే నేడు 24 గంటల విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా నిలబడుతుందన్నారు. ఇప్పటి వరకు రూ.3,500 కోట్ల రైతుబీమా అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు, దార్శనికతకు నిదర్శనమె రాష్ట్రంలో అమలవుతున్న రైతు పథకాలు అన్నారు. రైతు కల్లాలు, రైతు వేదికలు నిర్మించినట్టు తెలిపారు. వరి పంటలో పంజాబ్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందంటే సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అందించిన ప్రొత్సహమే అన్నారు. పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు రైతు బంధు ఇస్తూ రైతు బంధువుగా సీఎం కేసీఆర్ నిలిచారని తెలిపారు. రైతుబంధు నేటితో రూ.50 వేల కోట్లకు చేరడంతో రైతులు ఊరూరా సంబురాలు జరుపుకుంటున్నారని చెప్పారు. రూ.లక్ష కోట్లతో మూడేండ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచినట్టు తెలిపారు. మీ ఆశీర్వదాలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రైతులు, తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ను విడదీయలేరన్నారు. రైతును రాజుగా చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రపంచం, దేశంలోనే ప్రథములులు అన్నారు. నేడు రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో షాలినీరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీలు ఎల్లూ భాయి, హరికమురళీగౌడ్, జెడ్పీటీసీ అనితలాలి, పార్టీ మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సుదర్శన్, మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, మండల రైతుబంధు కమిటీ అధ్యక్షులు కంఠం కృష్ణారెడ్డి, కటికెల శ్యామల, ఎంపీటీసీలు, సర్పంచులు ధార భాస్కర్, సింగం ఆంజనేయులు నర్సింహారెడ్డి, రామచంద్రయ్య, జాం రవి, ఉపసర్పంచులు, వార్డుసభ్యులు లక్ష్మీ, మురళి, కో-ఆప్షన్ సభ్యులు, సొసైటీ డైరెక్టర్ కొండా భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు నర్సింహరెడ్డి, అమిరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రావు, చిత్తయ్య గౌడ్, అనిల్ రెడ్డి, కటికం రాజు, గోపాల్ , అంజిరెడ్డి, దత్తు, తదితరులు పాల్గొన్నారు