Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సమగ్రాభివద్ధికిి తమ వంతు కషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. నాదర్గుల్లోని 8వ డివిజన్ పరిధిలో 20లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి, స్థానిక కార్పొరేటర్ జి.ఇంద్రసేనతో కలసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతు నాదర్గుల్ నుండి ఆదిబట్ల మెయిన్ రోడ్డు వరకు వీధి దీపాలను సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాభివద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఒక విజన్‌తో పట్టణాల అభివద్ధికి కషి చేస్తున్నారని తెలిపారు. వంద సంవత్సరాల క్రితం కురిసిన వర్షం పడిన ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గతంలో కన్నా మెరుగైన పరిస్థితులు వచ్చాయన్నారు. నగరం, శివారు ప్రాంతాలలో 850 కోట్లతో సివరేజ్, నాలాల అభివద్ధికి కేటాయిస్తే, మహేశ్వరం నియోజక వర్గానికి రూ.90కోట్ల నిధులు మంజూరుకాగా బడంగ్పేట్ కార్పొరేషన్‌కు రూ.41కోట్లు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే వర్షా కాలం వరకు పనులు పూర్తి అయితే, వర్షం కష్టాలు తప్పుతాయనే దిశగా అధికారులు కషి చేస్తున్నట్లు తెలిపారు. తాగు నీటి నూతన లైన్ల కోసం రూ.65కోట్లు మంజూరు అయ్యాయ న్నారు. కార్పొరేషన్ అభివద్ధిలో రోడ్లది ప్రధాన పాత్ర. బాలపూర్ చౌరస్తా నుండి నాదర్గుల్ వరకు రూ.20 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని,సెంట్రల్ లైటింగ్‌తో నిర్మించనున్న రోడ్డుతో కార్పొరేషన్‌కు మహర్దశ వస్తుందన్నారు.
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా రహిత సమాజం కోసం ప్రార్థించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, 15 నుండి 18 ఏళ్ల వారికి వాక్సిన్ వేయించాలని, పెద్దలు అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలలో మేయర్ పారిజాత నరసింహ్మరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు రాంరెడ్డి, కార్పొరేటర్లు తోట శ్రీధర్‌రెడ్డి, నిమ్మల సినీత శ్రీకాంత్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.