Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్‌నగర్
అన్ని రకాల వసతులతో కూడిన ప్రాణహిత హాస్పటల్‌ను ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదివారం చైతన్యపురిలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ రంగా నరసింహగుప్తాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ రాహుల్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ప్రియతమ్ రెడ్డి, డాక్టర్ క్రిష్ణా, టి.సతీష్గుప్తలు హాస్పిటల్ స్పెషాలిటీ, పేషెంట్లకు అతి తక్కువ ధరలో కార్పొరేట్ స్థాయి, నాణ్యమైన వైద్య సేవలు అందించే చికిత్సల గురించి మంత్రికి తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటు ధరలో అందించాలని, ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కును ధరించి, రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని కొరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరారు. వైద్య చికిత్స కొరకు వచ్చే ప్రజలకు మరింత సేవా గుణంతో వైద్యం అందించాలని, వైద్య పరంగా ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, అందరి ఆదరాభిమా నాలు చొరగొనాలని ఆకాంక్షించారు.