Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో రైతు బంధు సంబరాలలో భాగంగా ఆదివారం గ్రామంలో ని పలు వీధులలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జడ్పి చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి లతో కలసి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడ లేనివిధంగా రాష్ట వ్యాప్తంగా 50 వేల కోట్ల రైతు బంధు సహాయం రైతులకు అందిందని అన్నారు. కొర్రెము గ్రామానికి 5 కోట్ల యాభై లక్షల రూపాయలు రూతు బంధు ద్వారా అందాయని తెలిపారు. గ్రామంలో మరణించిన 11 మంది రైతులకు 55 లక్షల రూపాయలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజులుగా చేసే విధంగా కషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు నందా రెడ్డి, మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, ఎంపిటీసి బొడ్డు వినోద, ఉపసర్పంచ్ కందుల రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు దయ్యాల ఆంజనేయులు, కోళ్ళ ఈశ్వరి, ఎరుకల దుర్గ రాజ్ గౌడ్, ఉడుగుల సునిత, కట్ట భార్గవి, మాటూరి సుష్మ, గొబ్బిరి లక్ష్మీ, వంగాల అరుంధతి, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మొగుల్ల సంతోష్ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ భైనగారి నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంద్ నాయకులు కోళ్ల యాదగిరి, మాటూరి రవి, తరిణే మహేంద్ర చారీ, చిలుకల నర్సింహ్మ, కట్టన నాగేష్ గౌడ్, గొబ్బిరి మణ్యం. గ్యార రవి, తదితరులు పాల్గొన్నారు .