Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అన్నదాతలకు ఓ వరమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలు అన్నారు ఈ సందర్భంగా మండలంలోని ఔషపూర్ గ్రామంలో ఆదివారం రైతుబంధు వారోత్సవాల కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలు వేసిన ముగ్గులను చెల్లించి ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షోభం నుండి అదనపు ఉత్పత్తులను స్థాయికి తెలంగాణ రైతాంగం చేరుకున్నారని తెలిపారు. తెలంగాణలో పండించిన పంటలను కేంద్ర సర్కార్ కొనలేక చేతులెత్తి చేసినట్లు గుర్తు చేశారు. రైతులను గౌరవించిన రాజ్యమే శ్రేయో రాజ్యమని రైతు కంట నీరు పెడితే రాజ్యం ఎప్పటికీ బాగుపడదు అన్నారు సంక్రాంతి పండుగ నాడు గాలిపటాల పై రైతు బొమ్మలను ఏర్పాటు చేసి గాలిలోకి వదిలి పెట్టాలని రైతులను ఆకాశమంత ఎత్తులో రైతులను పెట్టినట్లుగా అనుకోవాలి అన్నారు గత నాలుగేళ్ల నుండి ఇప్పటివరకు 50000 వేల 600 కోట్లు రైతుబంధు ఖాతాలో జమ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సర్పంచి కావేరి మహేందర్ రెడ్డి ఉప సర్పంచి ఐలయ్య యాదవ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల కొండల్ రెడ్డి నాయకులు నందా రెడ్డి దర్గా దయాకర్ రెడ్డి భిక్షపతి గౌడ్ బండారు శ్రీనివాస్ గౌడ్ అధికారులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు