Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసించటం వలన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని దక్షిణమధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సరస్వతీ విద్యా పీఠం తెలంగాణ ప్రాంతం సేవా విభాగం ఆధ్వర్యంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాల సంస్కార కేంద్రాలు నిర్వహిం చారు. అజాదిక అమత్ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మారుమూల బస్తీల్లో కూడా సంస్కారం విద్య అందించాలన్న గొప్ప ఆశయంతో సరస్వతి శిశుమందిర్ బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేయడంజరిగిందన్నారు. చిన్నారి బాలబాలికలకు నిష్ట కలిగిన వ్యక్తులుగా నిర్మాణం చేయాలన్నదే లక్ష్యంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలని, విద్యతో పాటు శారీరక ఐచ్ఛిక మానసికంగా పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే యోగ, ఆసనాలు, హిందూ సాంప్రదాయం పండుగలు, ఆటలు, పాటలు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. సంస్కార కేంద్రాల ద్వారా సమాజం పట్ల, దేశం పట్ల విద్యార్థులకు గౌరవం పెరుగుతుందని, మంచి అలవాట్లు ఉన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు దేశభక్తి గేయాలు, ప్రదర్శనలు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కుందూరు విద్వాన్ రెడ్డి, జిల్లా మల్లేష్, నడికుడి యాదగిరి, శూర కర్ణరెడ్డి, గంగాధర్ రెడ్డి, మల్లికార్జున్, దయానిధి, శ్రీరాములు యాదవ్, రాఘవ రెడ్డి, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.