Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
గంజాయిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న నలుగురిని రాచకొండ భువనగిరి ఎస్ఓటీ, రామన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. సోమవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ మీడియా కు వెల్లడించారు. అంతరాష్ట్ర ముఠాతో కలిసి ఇతర రాష్ట్రాలకు గంజాయిని హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇబ్రహీంపట్నం, బొంగుళూర్కు చెందిన వాడిత్యావత్ తిరుపతి ఇతని స్వస్థలం కర్నూలు జిల్లా. ఆర్గనైజర్‌గా ఉంటున్నాడు. నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన వాడిత్యావత్ కళ్యాణ్ అదే ప్రాంతానికి చెందిన పంచవత్ రవీందర్ అలియాస్ రవి డ్రైవరుగా వున్నాడు. పథలవత్ మక్తా ఇతని స్వస్థలం నగర్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బూచి బాబు అలియాస్ బాబ్జి సరఫరా చేసే వ్యక్తి. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కరం సురేందర్ దొర సరఫరా చేసేవారు. వారిని రామన్నపేట వద్ద అదుపులోకి తీసు కొని విచారించగా వారి వద్ద నుండి 294కేజీల గంజాయి, 2 కార్లు, 2సెల్ ఫోన్లు, 8500 నగదు స్వాధీనం చేసుకు న్నారు. మొత్తం వాటి విలువ. 43,85,000 రూపాయలు అని సీపీ తెలిపారు. బూచి బాబు, సురేందర్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ యాదగిరి, చౌటుప్పల్ ఏసీపీ ఉదరు కుమార్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, మోతీరం, వెంకటయ్య పాల్గొన్నారు.