Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిం చాలని ఉద్దేశంతో నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఎస్బీఐ నూతన బ్రాంచ్‌ను ప్రారంభిం చడం జరిగిందని తెలంగాణ రీజియన్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జిన్గ్రాన్ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి లష్కర్‌గూడ వెళ్లే దారిలో సోమవారం కోవిడ్ నిబంధనలకు లోబడి నూతనం గా ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ మాట్లా డుతూ ప్రజలకు ఎస్బీఐ మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందిస్తుందని, బ్యాంక్ ఖాతా లేని వారు ఇక్కడ నూతనంగా బ్యాంక్ ఖాతాలను తెరుచుకొని బ్యాంక్ సేవలు పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ క్రిషన్ శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ దేబాశిష్ మిశ్రా, రీజినల్ మేనేజర్ జెకె నాయుడు, బ్రాంచ్ మేనేజర్ అనిల్ బాబు, లష్కర్‌గూడ గ్రామ సర్పంచ్ ఎసూరి పారిజాత శేఖర్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.