Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫర్నీచర్ అద్దాలు, అగ్నిమాపక పరికరాలు ధ్వంసం
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కొంత మంది దుండ గులు అనురాగ్ యునివర్సిటీలో సెక్యూ రిటీ సిబ్బందిపై దాడిచేసి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారని స్టూడెంట్ ఆఫ్ అఫైర్స్ ఢన్ీ వెంపల్లి శ్రీని వాస్ రావు తెలిపారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ యునివర్సిటీలో సోమవారం దాదాపు 20మంది గుండాలు అకారణంగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీలపై దాడిచేసి రిసెప్షన్ వద్ద అద్దాలు, ఫర్నిచర్, అగ్నిమాపక పరికరాలను ధ్వంసం చేశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బంది నరేందర్సింగ్, హజరత్లకు గాయాలు అయినట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే యునివర్సిటీలో దాడులకు పాల్పడ్డారని, ఇట్టి వారిపై చర్యలు తీసుకోవలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.