Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజరాహిల్స్
ప్రత్యేక చట్టం ద్వారానే అనాథలకు న్యాయం జరుగు తుందని ఫోర్స్ సభ్యులు సిద్దం శ్వేత అన్నారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి ఫోర్స్ ఆధ్వర్యంలో అనాథ హక్కుల కోసం విన్నవిస్తున్నా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయడం హర్షణీయం అన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, స్మార్ట్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారని చెప్పారు. ముందుగా అనాథ అనే పదాన్ని నిర్వచించి, వర్గీకరణ చేపట్టాలన్నారు. అలాగే విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చట్టం రూపొందించడంలో ప్రభుత్వాలకు సులభతరం అయ్యేందుకు ఫోర్స్ ఆధ్వర్యంలో ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించి, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సమర్పిం చామన్నారు. రిటైర్డ్ జడ్జి ప్రసాద రాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనాథలకు ఆసరాగా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సమావేశంలో అనాథ హక్కుల కార్యకర్త గాదె ఇన్నయ్య, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త నాగేశ్వర రావు, ఫోర్స్ సభ్యులు కమతం రజిత, నీరజ రాణి, భాస్కర్ పాల్గొన్నారు.