Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఉస్మానియా డాక్టర్ల వైద్య సేవలు భేష్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉస్మానియా సూపరిం టెండెంట్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఇమాముద్దిన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం హెడ్ జి రమేష్ సోమవారం అరణ్య భవన్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఉస్మానియా వైద్యులను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లా డుతూ క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా రన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని, ప్రజలకు మెరుగైన వైద్యం అందిం చాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ఉస్మానియాలో అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి వివరించారు. 15 రోజుల కిందట అందుబాటు లోకి వచ్చిన క్యాథ్‌ల్యాబ్ వల్ల ఇప్పటి వరకు 50 కారోనరీ అంజియోగ్రామ్, 30 స్టెంట్స్, 3 ఫ్లురోస్కోపి వంటి చికిత్సలు అందించినట్లు తెలిపారు.