Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు నిదర్శనం అని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలానగర్ డివిజన్ వినాయక్ నగర్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సొంత నిధులతో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగవల్లులతో భూమాతను సేవించుకునే అదృష్టం మహిళలకు మాత్రమే దక్కుతుందని, అటువంటి ముగ్గుల పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముగ్గులు వేసిన మహిళల జీవితం కూడా రంగులమయం కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతు లతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు మందడి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ ఖాజా, గోవు వెంకటరెడ్డి, కవిత పాల్గొన్నారు.