Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
అత్యంత సాంకేతిక పరిజ్ఞా నంతో నూతన పండ్ల మార్కెట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, మొదటగా సంఘీ రోడ్డులో మార్కెట్‌కు వెళ్లేందుకు యాభై లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తు న్నట్లు మార్కెట్ శాఖ అదనపు సంచా లకులు ఆర్.లక్ష్మణుడు తెలిపారు. ప్రస్తుత సీజనల్ సమయం ప్రారంభం కావడంతో బాటసింగారంలోని తాత్కా లిక పండ్ల మార్కెట్లోని మౌలిక వసతులు, అక్కడ ఏర్పాట్లు, నూతనంగా నిర్మిస్తున్న షెడ్లను మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీజనల్ కాలం ప్రారంభం అవుతున్న దశలో వివిధ రకాల పండ్లు దిగుమతి అవు తాయని, అందుకు ప్రజలకు మౌలిక వసతులు కల్పిం చాలని ఉద్దేశంతోనే నూతన షెడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ ప్రజలకు అనువుగా ఉండేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డుకు కుడివైపున 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న షెడ్డు ప్రజలకు అనువుగా లేకపోవడంతో నూతనంగా మరో కొన్ని షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పండ్ల విక్రేతలకు, వినియోగదారులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నూతన షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇంకా తాత్కాలిక అవసరాల దష్ట్యా జాతీయ రహదారి పక్కనే ఉన్న కొంత స్థలాన్ని తీసుకోవడానికి భూ యజమానులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కోహెడ రెవెన్యూ పరిధిలో 178.09 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న మార్కెట్ పూర్తి అయ్యే వరకు పండ్ల క్రయ విక్రయాలు ఇక్కడే జరుగుతాయని తెలిపారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వసతులతో పండ్ల మార్కెట్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ అనంతరం మార్కెట్ నిర్మాణంకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.