Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే నియో జకవర్గ అభివృద్ధి సాధ్యం అని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం గోల్నాక డివిజన్ తులసినగర్లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు మొదల య్యాయని, వాటిని సకాలంలో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలన్నారు. పార్కులు, ఫుట్పాత్లు, వివిధ బస్తీల్లో చేపట్టాల్సిన డ్రయినేజీ, మంచినీటి పైప్లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సంక్రాంతి ముగిసేలోగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, మనోహర్, వాటర్వర్క్స్ డీజీఎం సతీష్, ఏఈ రోహిత్ పాల్గొన్నారు.