Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జి.జగన్
నవతెలంగాణ-బోడుప్పల్
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాణికులు కోరితే సాధారణ చార్జీల తో వారి కాలనీల వద్దకే ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించ బడుతుందని ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జగన్ తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో సోమవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సాధారణ ఛార్జీలతోనే బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రయాణికులు తాము బయలుదేరే కాలనీలు, గ్రామాలు, హాస్టళ్లు, కళాశాలల వద్దకు ప్రత్యేక బస్సులను అందించనున్నట్లు చెప్పారు. సాధారణ చార్జీలతోనే ఇక్కడి నుండి దూరప్రాంతాలకు తీసుకువెళ్లడంతో పాటు అదే బస్సులో తిరుగుప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లగేజీలు, చిన్నపిల్లలతో ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరుకునేందుకు ఇబ్బందులు పడకుండా సుఖవంతంగా చేరుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. అవసర మైన ప్రయాణి కులు ఈ సౌకర్యాన్ని వినియోగించు కునేందుకు తమ సమీప డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.
సంప్రదించవలసిన వివరాలు జి.జగన్ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ (9959226142), డిపో మేనేజర్ చెంగిచెర్ల (7893088433), కంటోన్మెంట్ డిపో మేనేజర్ (9959226143), హకీంపేట్ డిపో మేనేజర్ (9959226144), కుషాయిగూడ డిపో మేనేజర్ (9959226145), రాణిగంజ్-1 డిపో మేనేజర్ (9959226146), రాణిగంజ్-2 (9959226147) లను సంప్రదించాలని కోరారు. సురక్షితమైన సుఖవంత మైన రవాణా సౌకర్యానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.