Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరవాసులకు మెరుగైన సదుపాయాలు అందించడానికి జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, ఇంజినీరింగ్, శానిటేషన్, వైద్య, ఎలక్ట్రిసిటీ, యూసీడీ, యూబీడీ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలి పారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, ఎస్ఈ చిన్నారెడ్డి వివిధ విభాగాల అధికారులతో సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లా డుతూ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ద్వారా సిటీజన్స్ సర్వీసెస్ ఎవరి ప్రమేయం లేకుండా జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్, ట్రేడ్ లైసెన్స్, టీఎస్‌బీ పాస్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఇతర సర్వీసులను సిటీజన్స్‌కు అందించడంలో ముందంజలో ఉండాలన్నారు. కూకట్పల్లి జోన్‌లోని 22 వార్డుల్లో మంజూరు చేసిన గ్రేవ్ యార్డ్‌లను మోడల్ గ్రేవ్ యార్డ్కుగాను కాంపౌండ్ వాల్, వాటర్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 219 కమ్యూనిటీ హాల్స్‌ను మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగంలో లేని కమ్యూనిటీ హాల్స్‌ను జోనల్ కమిషనర్ ఆమోదంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 440 టాయి లెట్స్‌ను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడానికి డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓలు సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. జోనల్ వారిగా షీ-టాయిలెట్స్ నిర్వహణపై సంబంధిత అధికారులు పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు జరుగకుండా టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జోనల్ పరిధిలో ప్రజల నుంచి అందిన ఫిర్యా దులను జోన్లోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరు చేసిన థీమ్ పార్కులను పూర్తిస్థాయిలో నిర్మించి ప్రారం భానికి సిద్దంగా ఉంచాలని తెలిపారు. చెట్ల కొమ్మల వల్ల ఎలక్ట్రిక్ వైర్లు పాడవకుండా ప్రతి కాలనీలో ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు వర్షకాలం వరకే ఎస్ఎన్డీపీ ద్వారా కూకట్పల్లి పరిధిలోని నాలా పనులను పూర్తిస్థాయిలో నిర్మించి సిద్దంగా ఉంచాలని తెలిపారు. ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జంక్షన్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐడీపీఎల్ నుంచి షాపూర్‌నగర్ వరకు జంక్షన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతర్గత రోడ్ల అనుసంధానికి బీటీ, సీసీరోడ్లను పూర్తిస్థాయిలో నిర్మించడానికి ఎస్ఈ చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్వే ద్వారా లింక్, స్లిప్ రోడ్లను గుర్తించి, భూసేకరణ జరిపి రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెరువుల చుట్టూ ప్లాంటేషన్, గార్బేజ్ ఫ్రీగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనవరి 26 నుంచి ప్రతి శుక్రవారం ప్రతివార్డులో కార్పొరేటర్లు, అధికారులు ఫ్రైడే ట్రీ డేగా నిర్వహించాలన్నారు. కొత్త సంవత్సరంలో హరితహారం, లింక్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి వేగవంతంగా చర్యలు తీసుకో వాలని తెలిపారు. అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పిస్తూ ఏర్పాటైన కూకట్పల్లి, గాజుల రామారం, అల్వాల్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు కుత్బుల్లాపూర్, మూసాపేట సర్కిళ్లలో కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిపూట వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులకు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ను సెకండ్ డోస్ వంద శాతం అందించాలనీ, ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన 15 నుంచి 18 ఏండ్లలోపు వారికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలనీ, దీనిపై విస్త్రృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని తెలిపారు. కళాశాలలకు వెళ్లి స్వయంగా వ్యాక్సినేషన్ అందించాలని తెలిపారు. బూస్టర్ డోస్‌ను నేటి నుంచి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రతివారం స్ప్రేయింగ్ చేసేందుకు ఎంటమాలజీ విభాగం చర్యలు తీసుకోవాలని తెలిపారు. బస్టాప్‌లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. గార్బేజ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా నిరంతరాయంగా చెత్తను డంప్ యార్డ్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్య కార్మికుల వారసులకు ఉద్యోగాలను వెంటనే అందించేందుకు ఏఎంహెచ్ఓ, అధికారులు క్షేత్రస్థాయిలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్‌లకు సంబంధించి విషయాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజలకు మనమందరం జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. అధికారులందరూ ప్రజల గ్రీవెన్స్‌ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. యూసీడీ ద్వారా స్వయం సహాయక బృందాలకు వంద శాతం లోన్లను మంజూరు చేయాలని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ అనేది 365 రోజుల కార్యక్రమం అనీ, ఇందులో ఎస్ఎఫ్ఏలు, జవాన్లు, శానిటరీ సూపర్ వైజర్స్, ఏఎంఓహెచ్, డిప్యూటీ కమిషనర్లు నిరంతరాయంగా పర్యవేక్షించాలనీ, వాట్సప్‌ల ద్వారా ఫోటోలు కాకుండా క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. ఏఎంఓహెచ్‌లు, డిప్యూటీ కమిషనర్లు స్వీపింగ్ మిషన్ల పని తీరును స్వయంగా పరిశీలించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ కమిషనర్లు ప్రజా ఫిర్యాదులపై చాలా మర్యాదపూర్వకంగా నిర్ణీత సమయంలో పర్కిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ అన్ని శాఖలకు వారధిగా పని చేయాలన్నారు. సిటీజన్ సర్వీస్ సెంటర్లను పటిష్టంగా పని చేసేందుక చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్-19 సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతికంగా అందుబాటులో ఉండి సరియైన సమాచారం ద్వారా మార్గనిర్దేశం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ చిన్నారెడ్డి, సిటీ ప్లానర్ ఉమాదేవి, ఏఎంసీ శ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రశాంతి, నాగమణి, మంగతయారు, రవికుమార్, రవీందర్, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.