Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రైతుబంధు సంబురాల్లో భాగంగా సోమవారం కీసర, యాద్గార్పల్లి, చీర్యాల గ్రామాల్లో వారోత్స వాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. రైతు బంధు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 వేల కోట్లు ఇప్పటి వరకు పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో ఏ ప్రభు త్వం కూడా రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్ధులు, వితంతువులకు ఫించన్లు ఇవ్వడం లేదనీ, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. అనంతరం పీఎంఆర్ హెల్త్ సిటీ ఛైర్మెన్ డా.భద్రా రెడ్డి, డైరెక్టర్ డా.ప్రీతి రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. గెలుపొందిన వారికి మంత్రి మల్లారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందా రెడ్డి, ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారా యణ, కీసర సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభా కర్రెడ్డి, సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, సహ కర సంఘం వైస్ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి, ఎంపీటీసీ నారాయణ శర్మ, జూపల్లి వెంకటేష్, సర్పంచులు తుంగ ధర్మేం దర్, పుట్ట రాజు, ఉప సర్పంచ్ తర్రె మల్లేష్, కందాడి బాలమణి, కీసర మండల టీఆరెఎస్ అధ్యక్షులు జలాల్ పురం సుధాకర్ రెడ్డి, యువజన నాయకులు తాటాకం భాను చందర్ శర్మ, వార్డు సభ్యులు, టీఆరెఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : మల్లాపూర్ డివిజన్లో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ వార్డు ఆఫీస్ నుంచి శివ హౌటల్, జనప్రియ బస్ స్టాప్ నుంచి నోమా వైపుగా ట్రాక్టర్లు, రైతులతో భారీ ర్యాలీ నిర్వహించిన స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు మీర్పేట్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కిరణ్ కుమార్, తండా వాసుదేవ్ గౌడ్, డివిజన్ యువత అధ్యక్షులు శీతల విజరు, మహిళా, కార్మిక, విద్యార్ధి, బీసీ సెల్, స్థానిక రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ : మడ్ పోర్డ్ ధోబి ఘాట్ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో రైతుబంధు సంబురా లను నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రంగవల్లికలతో నేలపై తీర్చిదిద్ది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా రంగురంగుల అక్షరా లలో రాశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. టీఆర్ఎస్ మల్కాజి గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశే ఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.