Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మల్లాపూర్ శివ హౌటల్లో ఏర్పాటు కానున్న వైన్ షాపు అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ప్రొహిబి షన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సత్య ప్రసాద్, ధర్మేంద్ర, హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణ మాట్లాడుతూ మహిళా, విద్యార్థినుల రక్షణ కోసం తాము నిర్విరామంగా పోరాటం సల్పిస్తా మన్నారు. ఇప్పటికే ఈ వైన్ షాప్‌కు పూర్తి స్థాయి అను మతులు మంజూరు చేయవద్దని సంతకాల సేకరణ, మౌన పోరాట ధర్నా, జిల్లా అబ్కారీ శాఖ అధికారులకు, ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులకు వినతిపత్రం తదితర కార్యాచరణ ఉద్యమం జరిగిందని అయినా ప్రొవిషనల్ అనుమతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయక పోవడం శోచనీయమన్నారు. పాలకులకు అబ్కా రీ ఆదాయం ముఖ్యమా లేదా మహిళలు, విద్యార్థినుల భద్రత ముఖ్యమా అంటే ఆదాయమే ముఖ్యమని భావిం చడం సిగ్గు చేటు అన్నారు. మల్లాపూర్ శివ హౌటల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే వందల సంఖ్యలో విద్యార్థినులు చదువు దూరమయ్యే ప్రమాదం ఉంద న్నారు. అనుమతులను రద్దు చేసే వరకు తమ పోరు కొనసాగుతుందన్నారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ విషయంపై విచారణ చేస్తున్నామనీ, నివేదిక ఆధారంగా ప్రజా ఆమోదమైన న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విశాల్, హైదరాబాద్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చైతన్య యాదవ్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమూద్, మాజిద్ పాల్గొన్నారు.