Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
పేదింటి ఆడపడుచుల పెద్దన్న కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షోభం సమయంలో ప్రభుత్వానికి ప్రతి నెల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా పేదవారికి అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా ఫిించన్ లాంటి సంక్షేమ పథకాలను మాత్రం ఆపకూడదనే ఉద్దేశ్యంతో కేవలం ఒక్క బాలాపూర్ మండలంలోనే 3554 మందికి 35 కోట్ల 54 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఎన్ని అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పేదవారికి అందించే సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌవాన్, తీగల విక్రమ్‌రెడ్డి, ఫ్ల్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గజ్జల రాంచందర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, రెవిన్యూ అధికారులు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.