Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణలో ఏసీపీ ఆనంద్
నవతెలంగాణ-ధూల్‌పేట్
నైతిక విలువలతో కూడిన వార్తలను ప్రచురించడమే పత్రిక ప్రతిష్టత అని మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ అన్నారు. మంగళవారం నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్‌ను జోన్ ఇన్చార్జ్ వెంకటస్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలకు మనోవికాసాన్ని పెంపొందిం చడానికి, స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కారం దిశగా పని చేయడమే పత్రిక ప్రధాన లక్ష్యమన్నారు. అలా అన్నిటికీ చేరువలో ఉంటూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎం.ఏ. నాయుడు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
.