Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహా నాయకుడని, నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కషి చేస్తు న్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పెదభావి మల్లారెడ్డి పంక్షన్ హాల్లో మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలంలో మహేశ్వరం నియోజక వర్గంలో పేద కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల 450 కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, బాలాపూర్ మండల తహసీిల్దారు జి.శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు బిమిడి స్వప్న జంగారెడ్డి, లిక్కి మమత కష్ణారెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, బి.రోహిణీ రమేష్, లలిత కష్ణ, పి.శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, పవన్ కుమార్ యాదవ్, శివ కుమార్, నాయకులు కర్రె కష్ణ, ఈఎల్ వి.అశోక్, బల్వంథ్, కార్పొరేషన్ ఎస్సీ సెల్ అద్యక్షులు పి.సంతోష్ కుమార్, సాయి, మండల డిప్యూటీ తహశీల్దార్, వేణు, అర్ఐ శ్రీనివాస్, వివిధ డివిజన్ల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.