Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కషి చేస్తుందని, అల్మాస్‌గూడలోని ఇంద్రాహిల్స్ కాలనీలో అంతర్గత డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను ప్రారంభించటం జరిగిందని మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అల్మాస్‌గూడలో 5వ డివిజన్లో ఇంద్రాహిల్స్ కాలనీలో అంతర్గత డ్రయినేజీ పైప్ లైన్ నిర్మాణ పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి స్థానిక కార్పొరేటర్ బొయపల్లి దీపిక శేఖర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీలో పర్యటించిన మేయర్ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం దశలవారీగా పనులు పూర్తి చేస్తామని ముందు ప్రాధాన్యతగా డ్రయినేజీ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని అన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.