Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కరోనా మొదటి, రెండో విడతల ఉపద్రవం సందర్భంగా అభినయ థియేటర్స్ నిధులను సమీకరించి కష్టాల్లో ఉన్నవారికి, కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి సామాజిక సేవలోనూ భాగస్వామ్యం తీసుకొంటామని నిరూపించారు. ఒమిక్రాన్ ముప్పు క్రమంగా ముంచుకొస్తున్న సమయంలో అభినయ శ్రీనివాస్ ట్రస్ట్ నిర్వహణలో ప్రగతినగర్, సాయినగర్, చిక్కడపల్లిలోని అంజయ్య భవన్, ముషీరాబాద్ బస్తీల్లో 500 మంది పేదలు, వికలాంగులకు వేయి రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను పంపిణీచేశారు. అనంతరం మధురానగర్లో ఉన్న టీవీ నాటక కళాకారులు, సాంకేతిక నిపుణులకు సహాయం అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల ప్రసాద్, శంకర రావు, అడ్డాల అమీలేశ్వరి గౌడ్, క్రోసూరు సుబ్బారావు, కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.