Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ పరిపాలన అన్ని అంశాల్లోనూ మేటిగా నిలిచిందని, ప్రజానేత ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా దక్షతతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గుర్తు చేశారు. అటు కర్షక లోకం కన్నీటి బొట్టును తుడుస్తూనే.. పల్లె పల్లెకు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను చేరవేశారని వెల్లడించారు. ప్రతి కార్యాచరణలోనూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని, ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ పరిపాలనను చూసి నేర్చుకోవాలని సూచించారు. బోడుప్పల్లో స్వచ్ఛ ఆటోల ప్రారంభో త్సవం మంగళవారం నిర్వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై రూ.2 కోట్లతో కేటాయించిన 28 ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. స్వచ్ఛమైన పట్టణాల రూపకల్పన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. స్వచ్ఛ ఆటోలలో తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసేలా రుపొందించామని, ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. అలా చేయడం ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల సర్కారు అని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాంతాన్ని సుందరీకరణగా మార్చామని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ జీతాల పెంపుదలకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని, ఇటీవల ఆశా కార్యకర్తలకు కూడా వేతనాల పెంపు చేశారని గుర్తు చేశారు. ఇంటింటికి తాగునీటిని అందించి ఆడపడుచుల ఇబ్బందులను తొలగించారని అన్నారు. బీడు భూములు లేకుండా ప్రాజెక్టులను రూపుదిద్ది అన్నదాత కష్టాలను తీర్చిన ఆపద్బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎకరాకు పదివేల పెట్టుబడి సాయాన్ని అందించి కర్షకులకు చేయూత నందించారని అని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజల హదయాల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని, ప్రతి ఒక్కరి ఆర్థిక స్వావలంబనకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్, కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్‌గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, సీస వెంకటేశ్‌గౌడ్, మోదుగు లావణ్య రెడ్డి, బొమ్మకు సుగుణ, డి.మహేశ్వరి, కొత్త శ్రీ విద్య, దానగళ్ల అనిత, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, పులకండ్ల హేమలతరెడ్డి, సామల పవన్‌రెడ్డి, భూక్య సుమన్ నాయక్, రాసాల వెంకటేష్ యాదవ్, పొద్దుటూరి శోభారాణి, కొత్త దుర్గమ్మ, చీరాల నరసింహ, కోఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్నగౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కష్ణా, నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్, జె.రాములు, శేఖర్ రెడ్డి, చక్రపాణి, దానగల్ల యాదగిరి, జెన్న రాజు, మోతే రాజు,ఉప్పరి విజరు,సామల మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.