Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో 72 ఏండ్ల వృద్ధున్ని హైదరాబాద్ మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడిం చారు. బర్కత్పురాకు చెందిన గాదె వీరారెడ్డి కోఠిÄలో సుజాత లా పబ్లిసింగ్ హౌజ్‌ను నిర్వహిస్తున్నాడు. బర్కత్‌పురాలోని ఆయన నివాసంలో 2010లో ఓ మహిళను పనికి నియమించుకున్నాడు. ఆమె ఆ తర్వాత మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసముంటూ టైలరింగ్ చేస్తోంది. దాంతో లా బుక్స్‌తోపాటు ఇతర పుస్తకాలకు కవర్స్, బ్యాగ్స్‌ను వీరారెడ్డి సదరు మహిళ వద్ద కొనుగోలు చేసేవాడు. గతేడాది డిసెంబర్లో సైతం ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు మహిళ లేకపోవడంతో.. ఆమె కుమార్తె (13) ఇంట్లో ఎవరూ లేరు.. తర్వాత రావాలని చెప్పింది. కానీ, బాలికపై కన్నేసిన తాత వయస్సు ఉన్న ఈ దుర్మార్గుడు మాయ మాటలతో ఇంట్లోకి వెళ్లాడు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. విషయాన్ని తల్లికి చెప్పడంతో బాధితులు మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎం.మహేందర్‌రెడ్డి నిందితుడిపై పోస్కో చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న నిందితుడు తనపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని, లేకుంటే మీపేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితులను బెదిరించాడు. అయినప్పటికీ బాధితులు వెనుకడుగు వేయలేదు. వనస్థలిపురం ఏసీపీ కె.పురుషోత్తంరెడ్డి ఆదేశాలతో అన్ని కోణాల్లో విచారించిన ఇన్స్పెక్టర్ మంగళవారం నిందితు డిని అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు.