Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా ముందుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్‌బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో షాపూర్‌నగర్‌లోని ఈస్ట్ కోస్ట్ మాగెట్స్ కంపెనీ యజమాన్యం, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కంపెనీలో పని చేసే 49 మంది కార్మికులకు మూడేండ్లపాటు రూ.6200 వేతన ఒప్పందం యజమాన్యంతో ఒప్పించారు. ఈ సందర్భంగా కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కంపెనీ ఎండీ ధీరజ్ సర్ధా, యూనియన్ సభ్యులు వై.త్రిమూర్తులు, ఎన్.శ్రీనివాస్‌రావు, దుర్గాప్రసాద్, ప్రసంజిత్ మండల్, డి.అశోక్‌బాబు, అముల్, మనింద్రనాథ్, దాస్ తదితరులు పాల్గొన్నారు.