Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్
నవతెలంగాణ-అడిక్మెట్
క్యాబ్, ఆటో డ్రైవర్లు తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్లో సభ్యత్వ నమోదు చేసుకావాలి అని రాష్ట్ర అధ్యక్షులు బైరగోని రాజు గౌడ్ కోరారు. మంగళవారం యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆవ జంగయ్య, పతంగినరసింహ, ఎండి జమాల్, హాజీ భాష, మల్ల గల వెంకటేష్ తదితరులు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ యూనియన్లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా విలయ తాండవంలో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తూ డ్రైవర్లను కాపాడుకోవడానికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కల్వకోలు సురేందర్ రెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ కొంతం మహేష్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొడుగు శ్రీకాంత్ పాల్గొన్నారు.