Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మహిళల స్వయం ఉపాధికి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటుచేయడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు హరీశ్ రెడ్డి అన్నారు. ట్రైనర్ ఐశ్వర్య ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కుట్టుమిషన్, మగ్గం లలో శిక్షణ పొందిన వారికి మంగళవారం ఈడబ్ల్యుఎస్ భరత్‌నగర్, రాయలసీమ మైదానంలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించడం గొప్ప విషయం అని ట్రైనర్ ఐశ్వర్యను అభినందించారు. దాదాపు 200 మందికి ఒక్కరే శిక్షణ ఇవ్వడం విశేషమన్నారు. మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ మాట్లాడుతూ మహిళ సంపాదన తోడైతే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థతి మెరుగుపడుతుందన్నారు. కుట్టుమిషన్ల కొనుగోలుకు లోన్ ప్రక్రియలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి, జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి భవాని, రాష్ట్ర నాయకులు సద్గుణ రెడ్డి, శైలేష్, డాకయ్య, ఉదరు, చంద్రారెడ్డి, జానకి, గోపి, సాయి, అజరు తదితరులు పాల్గొన్నారు.