Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ కార్పొరేటర్ల నిరసన
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ అధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమను పిలిచి అవమానిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు సామల పవన్‌రెడ్డి, కుంభం కిరణ్ కుమార్ రెడ్డిలు అన్నారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ప్రారంభించిన స్వచ్ఛ ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అధికారిక కార్యక్రమంలా జరిగిందని విమర్శించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు కనీసం వేదికపై సీట్లు కూడా కేటాయించలేదని వాపోయారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా ప్రారంభించే ఆటోల కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పెత్తనం ఎక్కువైందని, దీనికి కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ అధికారుల తీరు మారకుంటే రాబోయే కాలంలో అభివద్ధి పనుల ప్రారంభోత్సవాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.