Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
జైస్వాల్గార్డెన కాలనీలో నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు జైస్వాల్ గార్డెన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ సిబ్బంది జైస్వాల్ గార్డెన్ కాలనీలో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చింతల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ అనేక రోజులుగా కాలనీలో వీధి దీపాలు లేక స్దానికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లి వీధి దీపాలను పునరుద్దరించామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీధి దీపాల సిబ్బంది ఉమేష్, రవి, విజయేందర్, కాలనీ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు మదుసూధనచారి, వినోద్‌కుమార్, అనిల్‌చారి, స్వామిగౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.