Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
మెహదీపట్నం డివిజన్ రెడ్‌హిల్స్‌లో అక్రమంగా నిర్మించిన నాల్గవ అంతస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ మాధవి, సెక్షన్ అధికారి నర్సింగ్ రావు మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమనిర్మాణాల కూల్చివేత చేపట్టినట్లు వివరించారు. ప్రజలు సరైన అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కూల్చివేతకు నాంపల్లి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.