Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ జనవరి 12, 1953లో ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఓయూ డా. బీఆర్ అంబేద్కర్ రిసర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొ. జాడి ముసలయ్య ఆధ్వర్యంలో బుధవారం లెక్చర్ సిరీస్ నిర్వహించారు. వీసీ ప్రొ. రవీందర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ 'హైదరాబాద్ రాష్ట్రం-అంబేద్కర్' అనే అంశంపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్‌గా దీన్ని తీర్చిదిద్దాలని డైరెక్టర్ ప్రొఫెసర్ జాడి ముసలయ్యని వీసీ ప్రొఫెసర్ రవీందర్ కోరారు. దానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ పెట్టిన బిక్ష వల్లే తామందరం ఈ స్థితిలో ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో రీసెర్చ్ సెంటర్ సలహాదారులు ప్రొ. చెన్న బసవయ్య, ప్రొ. అడప సత్యనారాయణ, కంట్రోలర్ ప్రొ. శ్రీనగేష్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొ. మంగు, బీసీ సెల్ డైరెక్టర్ ప్రొ.ఏసురత్నం, డా. బి రాములు, డా. అంజయ్య, ప్రొ.కాసిం, అశోక్ పాల్గొన్నారు.