Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బాలానగర్
బాలానగర్లో నివాసముంటున్న ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్నాటకం అనే చిత్రంలో మా స్వగ్రామం పెద్దాపురం పేరుతో అసభ్యకరంగా పాటని చిత్రీకరించిన చిత్రబందంపై చర్యతీసుకోవాలని నగరంలో స్థిరపడిన ఆంధ్రులు కోరుతున్నారు. జగన్నాటకం అనే పేరుతో త్వరలో విడుదల కాబోతున్న తెలుగు చిత్రంలో మా స్వగ్రామం పెద్దాపురం పేరుతో నా ఊరు పెద్దాపురం అంటూ అసభ్యకరమైన పాటను చిత్రీకరించి ఆదిత్య మ్యూజిక్ సంస్థవారు యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. పాటను వెంటనే తొలగించాలని ఆ పాట మహిళలను కించపరిచే విధంగా ఉన్నా యని చిత్ర దర్శక, నిర్మాతలు వాటిని వెంటనే తొలగించాలని నగరంలో స్థిరపడిన తూర్పు గోదావరి జిల్లా జె.ప్రసాద్ రాజ్ డిమాండ్ చేశారు.