Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమిషనర్ ఎమ్ఎన్ఆర్.జ్యోతి
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివద్ధికి పాటుపడతానని కమిషనర్ ఎమ్ఎన్ఆర్ జ్యోతి అన్నారు. బుధవారం కమ్మగూడ 22వ వార్డులో కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కొషికే ఐలయ్యతో కలిసి లక్ష్మీనగర్ కాలనీలో రూ.5లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైపు లైన్, ఏర్పాటు పనులను ప్రారంభించి, మున్సిపాలిటి పారిశుధ్య కార్మికులకు దుస్తులు, మాస్కులు, సబ్బులు, నూనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి సహకారంతో మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు కాకుమాను మరియమ్మ చెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు మూడవత్ రాజు నాయక్, కొంపెల్లి హనుమంత్గౌడ్, రాజు నాయక్, శేఖర్ యాదవ్, వేముల శంకర్, మహేష్ గౌడ్, సైదులు గౌడ్, శంకర్ నాయక్, శ్రీశైలం నాయక్, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.