Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో మద్యపానాన్ని నియంత్రించాలని టీడీపీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి జాతోతు ఇందిర, తెలుగు మహిళా అధ్యక్షురాలు సీహెచ్ విజయశ్రీ నేతృత్వంలో బుధవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో ఎంతో మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యపానాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అన్నపూర్ణ, రాష్ట్ర తెలుగు మహిళ శాంతి, మహిళా నాయకులు హేమలత, పద్మని రాథోడ్, మహియాజ్ తదితరులు పాల్గొన్నారు.