Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగ్గురు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత నైలాన్ మాంజాను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు.
వేర్వేరు చోట్ల ముగ్గురుని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.50లక్షల విలువైన మాంజాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం డీసీపీ పి.రాధాకిషన్ రావు తెలిపిన వివరాల మేరకు ధూల్‌పేట్‌కు చెందిన టి.పవన్ సింగ్, బేగం బజార్‌కు చెందిన మహావీర్ ప్రసాద్, కాచిగూడాకు చెందిన వై.గోయేల్లు బేగంబజార్, షాహినాథ్‌గంజ్ తదితర ప్రాంతాల్లో వేర్వేరుగా పతంగుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో అనుకున్న తీరులో లాభాలు రాకపోవడంతో నిషేధిత మాంజాను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత మాంజాను విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.