Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ సమక్షంలో రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని కలిసి భూదేవిహిల్స్ పరికి చెరువు సమీపంలోని, సర్వే నెంబర్ 336 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై, పరికి చెరువు పరివాహక ప్రాతం కబ్జాకు గురవుతున్నందున కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని ఫిిర్యాదు చేయగా, కేటీఆర్ స్పందించి సమగ్ర విచారణ జరిపి కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జరీచేశారన్నారు.