Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సందర్శించారు. జరుగుతున్న పనులపై ఆరా తీశారు. బంజారాహిల్స్‌లో 4 టవర్ల భవనాన్ని 20 అంతస్తుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోకి మారనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ సంక్షోభ నిర్వహణ కేంద్రంగా పనిచేయనుంది.
భవనంలో పటిష్టమైన భద్రతతోపాటు, పార్కింగ్, సమావేశ మందిరాలు, ఆడిటోరియంలు, ఎమర్జెన్సీ ఫ్లోర్లు, ముఖ్య మంత్రి, చీఫ్ సెక్రటరి, డీజీపీతోపాటు వీవీఐపీలకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఈ భవనంలో డేటా సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మార్చ్‌లో ఈ భవనం ప్రారంభం కాబోతుండడంతో బుధవారం నగర సీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిచారు. వెస్ట్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్, డీసీపీ సునితారెడ్డితో పాటు తదితర అధికారులతో కలిసి ప్రణాళికల మ్యాప్‌ను పరిశీలించారు. 20 అంతస్తు ల్లోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. జరుగుతున్న పనుల పురోగతి, పెండింగ్ పనులపై పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని, అందుకు పోలీసుల సహకారం పూర్తిగా ఉంటుందని కాంట్రాక్టర్లకు సీపీ సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో హైదరాబాద్ నగరానికి మూడో కన్ను కానుందని, దేశంలోనే తొలిసారిగా సింగపూర్, న్యూయార్క్‌లలో మాదిరిగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నామని సివి ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలతోపాటు ఏసీపీ సుదర్శన్, శ్రీనాథ్‌రెడ్డి, సంబంధిత ఇంజనీర్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.