Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
తెలుగు వారందరూ అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మహిళలకు అత్యంత ఇష్టమైన రంగవల్లుల (ముగ్గుల) పోటీలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని అందుకే సంక్రాంతి పండుగ మహిళలకు అత్యంత ఇష్టమైందని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు పీిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ డివిజన్
ఎం-కన్వెన్షన్ రోడ్డులో, 16వ డివిజన్ విష్ణుపురి ఎన్క్లేవ్, గణేష్ నగర్, శంకర్ నగర్ కాలనీ బండి సత్తయ్య కమ్యూనిటీ హాల్లో 2వ డివిజన్ శ్రీసాయి నగర్ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ రంగవల్లుల పోటీలకు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ముగ్గుల పోటీలను ప్రారంభించి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భం గా మేయర్ జక్క వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ''హరితహారం'', ''పరిశుభ్రమైన పట్టణాలు'' మరియు ''స్వచ్ సర్వేక్షన్ 2022'' వివిధ సామాజిక అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా ముగ్గులను వేయవలసిందిగా మహిళలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారు మంజుల, బండి రమ్య, కే.సుభాష్ నాయక్, సీనియర్ నాయకులు బండారి రవీందర్, బండి సతీష్‌గౌడ్, జావిద్ ఖాన్, బండి శ్రీరాములుగౌడ్, ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, సుక్క జయేందర్, కర్రె బల్రామ్, సమ్మిరెడ్డి, వార్డు కమిటీ సభ్యులు, మహిళలు, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, కాలనీవాసులు, కాలనీ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.