Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాతబస్తీలో రోడ్ల వెడల్పు కోసం ఆస్తుల సేకరణ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కోసం నిధుల మంజూరు ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. 12 అంశాలకుగాను 10 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మీర్జా ముస్తఫా బేగ్, మండగిరి స్వామియాదవ్, బతా జాబిన్, విజరు కుమార్‌గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ప్రవీణ్ సుల్తాన, సీఎన్.రెడ్డి, మందడి శ్రీనివాస్‌రావు, సామల హేమ, ఈఎన్సీ జియాఉద్దీన్, ప్రాజెక్ట్ సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి లక్ష్మి, ప్రాజెక్ట్ ఎస్ఈ రవీందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు
శ్రీ ఆర్డీపీ కింద హఫీజ్ బాబానగర్ మెయిన్ రోడ్డు నుంచి బాలాపూర్ రోడ్డు వయా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ ప్లాంట్ డీఆర్డీఓ కాంపౌండ్ వాల్ వరకు రోడ్డు వెడల్పు కోసం 542 ఆస్తుల సేకరణకు పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
శ్రీ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ జంక్షన్ óవృద్ధి చేయడానికి పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
శ్రీ సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ విలేజ్‌లో శ్రీలక్ష్మికి సంబంధించిన 12.64 చదరపు గజాలను జీహెచ్ఎంసీ పార్కుకు మార్పిడి చేస్తూ అట్టి మొత్తాన్ని హుడా లేఅవుట్ నుంచి శ్రీలక్ష్మికి మార్పిడి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
శ్రీ అజ్మత్ నగర్‌లోని సీి.హెచ్.భువనేశ్వరికి చెందిన 4.58 చదరపు గజాలను జీహెచ్ఎంసీ పార్కుకు మార్పిడి చేస్తూ అట్టి మొత్తాన్ని ఉప్పల్ మండలం, ఉప్పల్ కలాన్ విలేజ్ బాలాజీ ఎన్ క్లేవ్లో సీ.హెచ్.భువనేశ్వరికి మార్పిడి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
శ్రీ చార్మినార్‌జోన్ సర్కిల్ నెం.8 చాంద్రాయణగుట్ట గవర్నమెంట్ హైస్కూల్ గౌస్‌నగర్, బార్కస్(వార్డు నెం.42) నందు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ (జీ+3) నిర్మాణానికి రూ.495 లక్షలు మంజూరుకై పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
శ్రీ చార్మినార్ జోన్ సర్కిల్ నెం.8 చాంద్రాయణగుట్ట కంచన్‌బాగ్ (వార్డు నెం.41) దర్గా బర్హానే, షా సాహెబ్ రోడ్డు వద్ద మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ (జీ+3) నిర్మాణానికి రూ.494 లక్షలు మంజూరుకు పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
శ్రీ సికింద్రాబాద్ జోన్ సర్కిల్ నెం.16, అంబర్పేట్ (వార్డు నెం.83) రీ మోడలింగ్ ఆఫ్ స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ వెటర్నరీ హాస్పిటల్ నుంచి ఎస్టీపీ బ్యాక్ గేట్ వరకు నిర్మించడానికి రూ. 260లక్షలు మంజూరుకు పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
శ్రీ సికింద్రాబాద్ జోన్ అడిక్‌మెట్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) రిస్టోరేషన్ పనులకు రూ.5.95 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు
శ్రీ ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం టీఎస్ఎస్ పీడీసీఎల్‌కు సంబంధించిన 400 చదరపు గజాలు కోల్పోతున్న మొత్తాన్ని హిమాయత్‌నగర్ మండలం బాగ్‌లింగంపల్లి ఇండిస్టీ యల్‌కు సంబంధించిన భూమిని టీఎస్ఎస్పీడీసీఎల్కు బదలాయింపు చేయడానికి పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
శ్రీ ఆర్డీపీ కింద శివమ్ రోడ్ నుంచి సత్య సాయి విద్యా విహార్ స్కూల్ వయా డీడీకాలనీ, సాయిబాబా టెంపుల్ వద్ద 18 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం 45 ఆస్తుల సేకరణకు పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.