Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పయనించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా ఇతర దేశాల్లో తన ఉపన్యాసాల ద్వారా యోగా, వేదాంత శాస్త్రాలను పరిచయం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, సీఎన్.రెడ్డి, కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.