Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్‌ఎఫ్‌బీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి సారా ప్రవీణ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా థర్డ్ వేవ్ (ఒమిక్రాన్) విస్తరిస్తున్న నేసథ్యంలో ప్రభుత్వం అనేక రకాలుగా కరోనాను నివారించడానికి ఎన్నో సూచనలను ప్రజలకు తెలియ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇది టచ్ చేయడం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే అంధó ఉద్యోగులు ఇతరుల సపోర్ట్ లేకుండా, బస్సులలో టచ్ చేయకుండా వారు ఆఫీస్‌కు వెళ్ళలేరు. కాబట్టి కరోనా తొందరగా వాళ్లకు వచ్చేఅవకాశం ఉన్నది. దీంతో వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అంధ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈనెల 31వరకు కల్పిం చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంధ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని జాతీయ అంధుల సమాఖ్య తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి సారా ప్రవీణ్ కుమార్‌గౌడ్, అధ్యక్షులు వీసీ.వీర రాఘవన్ విజ్ఞప్తి చేశారు.