Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసత్య ప్రచారం చేస్తూ దాడులకు దిగిన ఏబీవీపీి నాయకులపై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అనురాగ్ యునివర్సిటీలో కొవిడ్ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రత్యేక్ష తరగతులు నిర్వహించడంలేదని యూనివర్సిటీ డీన్ీ వెంపల్లి శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ యునివర్సిటీలో కొవిడ్ నిబంధనలకు లోబడి వ్యవహరిస్తున్నామని, ఎలాంటి ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంలేదని, ఏబీవీపీి విద్యార్థులు దాదాపు 30 మంది రాజకీయ దురుద్దేశంతోనే యునివర్సిటీలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లు, అద్దాలు, సెక్యూరీటీి సిబ్బందిపై భౌతిక దాడులకు దిగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థుల అభ్యర్థన మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పలు పాఠ్యాంశాలలో పరీక్షలు నిర్వహించామని పేర్కోన్నారు. ఏబీవీపీ విద్యార్థులు యునివర్సిటీపై అసత్య ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి వారిపై పోలీసులు, అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరారు.