Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహిదీపట్నం
ప్రేమించి మోసం చేశాడని యువకుడిని కత్తితో యువతి గాయ పర్చింది. ఈ ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జన్వాడకు చెందిన కృష్ణ కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. పరిగికి చెందిన సంపూర్ణ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఏడాది కాలంగా శంకర్పల్లిలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. కాగా ఏడేండ్లుగా పరిగి ప్రాంతానికి చెందిన రెహనా అనే యువతితో కూడా కృష్ణ లంగర్ హౌస్లో ఉంటున్నాడు. కృష్ణ అటు సంపూర్ణతో పాటు ఇటు రెహనాతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. అయితే కృష్ణ రెహనాతో కూడా ఉంటున్నాడని సంపూర్ణ తెలుసుకుని కోపంతో ఆదివారం మధ్యాహ్నం రెహనా ఇంటికి వచ్చింది. అక్కడ కృష్ణతో గొడవ పడి కత్తితో గొంతుపై పొడిచి గాయపరిచింది. వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు సంపూర్ణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.