Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరం నుంచి పెద్ద ఎత్తున జనం సొంతూర్త్లకు తరలి వెళ్లడంతో నగరం ఒక్కసారిగా బోసిపోయింది. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు, చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల మోత.. హారన్ల కూత.. ట్రాఫిక్ జామ్‌ల జంజాటం పూర్తిగా తగ్గి మళ్లీ లాక్డౌన్ అమలు చేస్తున్నారా? అనే విధంగా రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగర రోడ్లపై నిత్యం దాదాపు 25 నుంచి 30 లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయనీ అంచనా.. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ , సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం వెళ్లే వాహనాలు పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదగా విధులు నిర్వహించడానికి నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి. వీఐపీలు ఎక్కువగా వెళ్లే ఈ ప్రాంతంలో గంటల తరబడి కదలకుండా అలాగే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలందరూ పండగలకు వెళ్లడంతో ట్రాఫిక్ రద్దీ సగానికి తగ్గిపోయింది. శుక్రవారం నుంచి పండుగ సెలవులు కావటంతో నగరంలో రద్దీ మరింతగా తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో వారాంతంలో సహజంగా కొంత మేర రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం నగరంలో దాదాపుగా బోసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే నగరవాసులు ఇప్పుడు హైవే మీద వెళ్లినట్టుగా నగరంలోని రోడ్లపైన ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. ఇక కాలనీలు, బస్తీలు సైతం జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. జనం లేక షాపింగ్ మాల్స్, దుకాణాలు బోసిపోయాయి. మూడు రోజులుగా నగరంలోని అన్ని రకాల వ్యాపారాలు కూడా తగ్గిపోయినట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిసారి సంక్రాంతి సీజన్లో ఇదే జరుగుతుందనీ, ఈసారి మాత్రం మరికొంత పెరిగినట్టు చెబుతున్నారు. ఓ వైపు కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులు.. మరోవైపు సొంతూళ్ల ప్రయాణాల కారణంగా దాదాపు 30 నుంచి 40 శాతం వ్యాపారం తగ్గిపోయినట్టు అంచనా వేస్తున్నారు. కొత్త దుస్తులు, నగలు, గృహౌపకరణాలు కొనుగోళ్లు కూడా బాగా క్షీణించాయంటున్నారు. టిఫిన్ సెంటర్లు, ఛారు బండ్లు రహదారులపై చిన్నా చితకా వ్యాపారం చేసుకునే వారి నుంచి భారీ హౌటళ్లు, షాపింగ్ మాళ్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ముందుగా ఈ నెల 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులను మరిన్ని రోజులు పొడిగించినట్టు సర్కార్ జీవో జారీ చేసింది.