Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
గత ప్రభుత్వాలు వైశ్య జాతిని విస్మరించాయనీ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వైశ్యులకు ఇన్ని పదవులు వచ్చాయని రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీనివాస్ గుప్తా అన్నా రు. ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సికింద్రాబాదు మహిళా విభాగం ప్రమాణస్వీకారోత్సవం మౌలాలిలోని కైలాసగిరి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ భవిష్య త్లో కూడా వైశ్యులకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సముచిత స్థానం కల్పిస్తారన్నారు. మరి కొంత మందికి పదవులు వచ్చే అవ కాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే ఐవీఫ్ పేరు గడించిందన్నారు. ఐవీఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్ర మాలు చేపట్టి పేద ఆర్యవైశ్యులను ఆదుకున్నట్టు తెలిపారు. నూత నంగా నియమితులైన ఐవీఫ్ సికింద్రాబాదు డివిజన్ మహిళా అధ్యక్షురాలు తిరువీధి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఉప్పుగల్ల సంధ్య, కోశాధికారి భువనగిరి హరితను అభినందించారు. ఐవీఫ్ రాష్ట్ర ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ఈ ముగ్గురితోపాటు పది మంది కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ అధ్యక్షత వహిం చగా, అథితులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి కోడిప్యాక నారాయణ, రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మెన్ బచ్చు శ్రీనివాస్, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మెన్ రఘు గంగిశెట్టి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ ఐవీఫ్ నాయకులు సుధాకర్, గుండా శ్రీనివాస్, వీరేశం, ప్రభాకర్, బాబాన్న, అనిల్, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.