Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని సర్దార్‌పటేల్ నగర్, దుర్గానగర్, విష్ణుపురి తదితర కాలనీల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ వరద ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తిరిగి పరిశీలించి, అవసర మున్న చోట ఎమర్జెన్సీ రెస్క్యూ టీంలను పిలిపించి తగిన మరమ్మతులను చేయించారు. ఈ కార్యక్రమంలో వినరు, సునీల్, వినోద్‌యాదవ్, శివానంద్, బాలచందర్, చారి, మురళిగౌడ్, శ్రీకాంత్, సాయి పాల్గొన్నారు.