Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఫుట్‌బాల్ ఆసియన్ కప్ టోర్నీలో పాల్గొనడానికి కేరళలోని కొచ్చిన్‌లో ట్రైనింగ్ క్యాంప్‌లో సీనియర్ మెన్ టీం తో ప్రాక్టీస్ చేస్తూ, ఆటలో గాయపడి కుడి చేయి మణికట్టు విరగడంతో స్వస్థలం నిజామాబాద్‌కు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణకు చెందిన ప్రముఖ భారత జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్ కుమారి గుగులోతు సౌమ్యను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ అల్లీ పురం వెంకటేశ్వరరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సౌమ్యతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో వీడియో కాల్లో మాట్లాడించారు. మంత్రి సౌమ్యతో మాట్లాడుతూ ట్రీట్ మెంట్‌ను హైదరాబాద్‌లో అందిస్తామనీ, ఆర్థిక సాయం కూడా చేస్తామనీ, ధైర్యంగా ముందుకు సాగాలని సూచిచారు. చైర్మెన్ మాట్లాడుతూ సౌమ్యకు అన్ని విధాలుగా అండగా ఉండి, ప్రభుత్వం నుంచి తగిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసి యేషన్ సెక్రెటరీ ఫాల్గుణ, తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిలు, నిజామాబాద్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.